ఆర్టీసి కార్గో ద్వారా భద్రాచల సీతారామచంద్ర స్వామి తలంబ్రాలు

byసూర్య | Sun, Mar 19, 2023, 11:26 AM

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాచల సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవ తలంబ్రాలను కార్గో సర్వీస్ ద్వారా ప్రజలకు అందజేయనున్నట్లు సిద్దిపేట ఆర్టీసీ డీపో మేనేజర్ సుఖేందర్ రెడ్డి శనివారం తెలిపారు. భద్రాచలం వెళ్లలేని వారు శ్రీరాముడి కల్యాణ తలంబ్రాల కోసం రూ. 116 చెల్లిస్తే ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటి వద్దకే పంపిస్తామని పేర్కొన్నారు. తలంబ్రాలు అవసరమున్న వారు సిద్దిపేట ఆర్టీసీ కార్గో కౌంటర్లో సంప్రదించాలన్నారు. ఒకే కాలనీ లేదా ప్రభుత్వ కార్యాలయానికి చెందిన 30 మంది ఆసక్తిగా ఉంటే, బుకింగ్ కోసం ఆర్టీసీ సిబ్బందిని వారి వద్దకే పంపిస్తామన్నారు. వివరాలకు 7382875119 అనే ఫోన్ నంబర్ లో సంప్రదించాలన్నారు.


Latest News
 

రైతుల కష్టానికి చలించి,,,వామనం దిగిమరీ సహాయం చేసిన ఎస్సై Fri, Mar 31, 2023, 10:05 PM
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం,,,ప్రజలకు కష్టాలు Fri, Mar 31, 2023, 10:04 PM
పేపర్ లీక్ ఘటనలో కీలక మలుపు... దృష్టి సారించిన ఈడీ Fri, Mar 31, 2023, 10:04 PM
లంచం తీసుకున్న కేసులో ఎస్సైకి రెండేళ్ల శిక్ష,,,2013లో జరిగిన కేసులో తీర్పు వెలువరించిన అనిశా కోర్టు Fri, Mar 31, 2023, 10:03 PM
వివాహిత ఆత్మహత్య యత్నం... కాల్ వచ్చిన 3 నిమిషాల్లోనే ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ Fri, Mar 31, 2023, 10:02 PM