ఆ ఇద్దరూ తెలంగాణను దోచుకొంటున్నారు: ధర్మపురి అర్వింద్

byసూర్య | Mon, Jan 30, 2023, 05:43 PM

తెలంగాణను కేటీఆర్, కవిత దోచుకుంటున్నారని  నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర విమర్శలు చేశారు.. కేసీఆర్ ఎన్నికల హామీలు తప్ప ఆచరణలో శూన్యమని, డబుల్ బెడ్ రూం, చక్కెర కర్మాగారాల పునరుద్దరణ హామీ ఏమైందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గవర్నర్‌ను అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నారని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత సామాన్య ప్రజల జీవితం దిగజారిపోయిందని తెలిపారు.


వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లలో కేటీఆర్ ఓడిపోవడం ఖాయమని అర్వింద్ జోస్యం చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో కంటే తెలంగాణలోనే పెట్రోల్, డీజిల్ ధర ఎక్కువగా ఉందని విమర్శించారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. అర్వింద్‌పై విమర్శలు చేశారు. అర్వింద్ ఒక్క రూపాయి అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. కేంద్రం ఒక్క రూపాయి అయినా అదనంగా నిధులు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని చెప్పారు. ఒక్క పని కూడా అర్వింద్ చేయలేదని ఆరోపించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు అర్వింద్ ఇవాళ కౌంటర్ ఇచ్చారు.


'మీ లెక్క మేం స్కాంలు, డ్రగ్స్ దందాలు చేయలేదు. పసుపు రైతుల్ని ఎందుకు పట్టించుకోరు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ గుర్తుకు రాదా? మీ దొరను, దొరతనాన్ని రోడ్డు మీదకు తెస్తం. పల్లె ప్రకృతి, వైకుంఠధామాల్లో కేంద్రం నిధులు ఉన్నాయి. కేంద్రం నిధులపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్ రిజైన్ చేస్తా అనగానే అక్కడున్నవాళ్లు చప్పట్లు కొట్టారు. ఆరోగ్యశ్రీ ఆటకెక్కించారు.. ఆయుష్మాన్ భారత్ అమలే లేదు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఎన్ని కట్టారు.. ఎన్ని ఇచ్చారు. 30 జిల్లాలకు డీఈవోలు, 90 శాతం మండలాల్లో MEOలు లేరు. 17 ఇథనాల్ ప్లాంట్లకు కేంద్రం పర్మిషన్ ఇచ్చింది' అని ధర్మపురి అర్వింద్ చెప్పారు.


'జాగా ఉంటే ఐదు లక్షలు ఇళ్లు కట్టుకోవడానికి ఇస్తామన్నారు. ఇప్పటివరకు అమలు చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్లు తిన్నారు. అందుకే డీటైల్ ప్రాజెక్టు రిపోర్టు ఇవ్వడం లేదు. మీరు డీపీఆర్ ఇస్తే జాతీయ హోదా తెచ్చే బాధ్యత తీసుకుంటాం' అని ధర్మపురి అర్వింద్ చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత కల్వకుంట్ల కుటుంబ సభ్యుల జీవితమే బాగయింది తప్ప, సామాన్య ప్రజల జీవితం దిగజారిందని విమర్శించారు.



Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM