కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ నాయకుడు గుర్నాథ్ రెడ్డి

byసూర్య | Fri, Jan 27, 2023, 02:22 PM

మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శుక్రవారం కొడంగల్ లో ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరారు. మాజీ ఎమ్మెల్యేతో పాటుమాజీ ఎమ్మెల్యే ఆర్. గుర్నాథ్ రెడ్డి కుమారుడు కొడంగల్ మున్సిపల్ చైర్మన్ ఆర్. జగదీశ్వర్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. కొడంగల్ నియోజకవర్గంలోని దిగ్గజ నాయకుల్లో గుర్నాథ్ రెడ్డి ఒకరు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత గుర్నాథ్ రెడ్డిది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించారు. తాజాగా గుర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం కొడంగల్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.


Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM