ఉమ్ర యాత్రకు బయలుదేరిన ప్రయాణికులు

byసూర్య | Fri, Jan 27, 2023, 12:41 PM

శుక్రవారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో నుండి ఉమ్రా యాత్ర చేసుకోవడానికి అల్ మిజన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో 160 మంది గల యాత్రికుల బృందం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో వారి కుటుంబ సభ్యులు విడ్కోలు పలికి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఎవరినైతే భగవంతుడు కరుణిస్తాడో వాళ్లే ఉమ్రా యాత్రా చేసేందుకు ముందుంటారని హఫేజ్ మహమ్మద్ ఫయాజ్ అలి తెలిపారు. తల్లిదండ్రుల అశీవ్రాదం ఉంటేనే మక్క, మదీనాలను దర్శించుకునే భాగ్యం కలుగుతుందని ఐయన అన్నారు‌. నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనలు దృష్టిలో పెట్టుకుని భగవంతుని ప్రతి ఒక్కరు కొలవాలని అన్నారు. భగవంతుని కృప ఉంటే ప్రతి రంగంలో రానిస్తామని తెలిపారు.శుక్రవారం బయలుదేరిన 160 మంది ఇస్లామిక్ మతస్తులు 15 రోజుల పాటు మక్కా, మదీనాలలో ప్రత్యేక ప్రార్థనలు చేసి తిరిగి చేరుకుంటరని అన్నారు. యాత్రికులలో తెలంగాణ నలుములల నుండి వచ్చారని తెలిపారు. ప్రతి ఒక్కరికి ఏలాంటి అసౌకర్యం కలగకుండా చూసే బాధ్యత తనపై ఉందని ధీమా వ్యక్తం చేశారు.

Latest News
 

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మధు Wed, May 22, 2024, 12:48 PM
నాగరాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే మేఘారెడ్డి Wed, May 22, 2024, 12:18 PM
కోదాడలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచారం Wed, May 22, 2024, 12:16 PM
బస్సు ఓమిని వ్యాన్ ఢీ Wed, May 22, 2024, 11:41 AM
దెగుల్ వాడి నర్సరీ పరిశీలించిన ఎంపీడీవో Wed, May 22, 2024, 11:23 AM