సేవా అవార్డు అందుకున్న కారేపల్లి ఎక్సైజ్ సీఐ

byసూర్య | Thu, Jan 26, 2023, 07:46 PM

కారేపల్లి మండల ఎక్సైజ్ సర్కిల్ సిఐగా పనిచేస్తున్న జూలీ ఫికర్ అహ్మద్ కు జిల్లా కలెక్టర్ వీపి గౌతమ్ చేతులు మీదుగా గురు వారం ఉత్తమ సేవా అవార్డు అందుకున్నారు. 74వ గణతంత్ర వేడుకలు సందర్భంగా సిఐ కి కలెక్టర్ ఈ అవార్డును అందజేశారు. కారేపల్లి సర్కిల్ పరిధిలోని కారేపల్లి , కామేపల్లి, ఏన్పూర్ మండలాలలో నాటు సారా నియంత్రించడంతోపాటు, సర్కిల్ పరిధిలో సుమారు 30 మంది సారా విక్రయిదారులను పట్టుకొని వారికి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించి, ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చారు. దీంతోపాటు పలు సేవా కార్యక్రమాలను కూడా ఆయన నిర్వహించారు. ఇందుకుగాను ఆయనకు అవార్డుతో పాటు, ప్రసాస పత్రాన్ని కలెక్టర్ అందజేశారు. సర్కిల్ సీఐ జూలీ ఫికర్ అహ్మద్ ను ఇబ్బంది అభినందనలు తెలిపారు.


Latest News
 

కవితను విచారించిన ఈడీ... వేగంగా సాగుతున్న విచారణ Tue, Mar 21, 2023, 10:33 PM
యూట్యూబ్ చానళ్లు పై నటి హేమ పోలీసులకు ఫిర్యాదు Tue, Mar 21, 2023, 10:33 PM
ఢిల్లీలో ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 10:02 PM
కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ Tue, Mar 21, 2023, 08:27 PM
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన... మంత్రి సబితా ఇంద్రారెడ్డి Tue, Mar 21, 2023, 07:50 PM