ఏ ముఖం పెట్టుకొని మోడీ ఓట్లు అడుగుతారు: కేటీఆర్

byసూర్య | Tue, Jan 24, 2023, 07:00 PM

పాలమూరు నుంచి ప్రధాని మోదీ పోటీ చేస్తారని బీజేపీ నేతలు అంటున్నారని, ఓవైపు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు అన్యాయం చేస్తూ, ఏ ముఖం పెట్టుకుని పాలమూరులో ఓట్లు అడుగుతారని తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచినందుకు మోదీ దేవుడయ్యాడా? అంటూ విమర్శించారు. ఇదిలావుంటే తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ నారాయణపేట జిల్లాలో పర్యటించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, బీజేపీపై ధ్వజమెత్తారు.


పాలమూరు ఎత్తిపోతలకు కేంద్రం ఆటంకాలు కలిగించినా, పనులు పూర్తిచేసి పాలమూరు రైతాంగానికి నీళ్లు అందించే బాధ్యత కేసీఆర్ సర్కారుదేనని పేర్కొన్నారు. అవసరమైతే న్యాయపోరాటాలు చేస్తామని, ప్రజాక్షేత్రంలోనూ తేల్చుకుంటామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అందరినీ మట్టికరిపించి, 2024లో కేంద్రంలోనూ అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణలోనూ హ్యాట్రిక్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మతం పేరిట పంచాయితీ పెట్టే వారిని తిప్పికొడదామని అన్నారు.Latest News
 

కుత్భుల్లాపూర్‌లో బీఆర్ఎస్‌ అభ్యర్థి కేపీ వివేక్‌కు 6757 ఓట్ల ఆధిక్యం Sun, Dec 03, 2023, 09:39 AM
కేసీఆర్ కు 300 ఓట్లు.. హరీష్ రావు 6,305 ఓట్ల ఆధిక్యం Sun, Dec 03, 2023, 09:35 AM
హైదరాబాద్ లో బిఆర్ఎస్ లీడ్ Sun, Dec 03, 2023, 09:34 AM
హైదరాబాద్ లో బిఆర్ఎస్ లీడ్ Sun, Dec 03, 2023, 09:32 AM
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా Sun, Dec 03, 2023, 09:22 AM