చంద్రన్న ఆశయ సాధనకు కృషి: ఎమ్మెల్యే రవీంద్ర కుమార్

byసూర్య | Tue, Jan 24, 2023, 02:08 PM

కార్మిక, కర్షక పక్షపాత హన్మంత్ చంద్రన్న అని దేవరకొండ శాసన సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలో మాజీ సర్పంచ్ హన్మంత్ చంద్రన్న 18వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. చంద్రన్న ఆశయ సాధనకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేసిన నేత చంద్రన్న అని ఆయన కొనియాడారు. ప్రజా ప్రతినిధులకు ఆదర్శంగా ఉన్న నాయకుడు హన్మంత్ చంద్రన్న అని ఆయన తెలిపారు. బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జడ్పీటీసీ మారుపాకుల అరుణసురేష్ గౌడ్, రైతు బంధు అధ్యక్షుడు సిరందాసు కృష్ణయ్య, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, మండల పార్టీ అధ్యక్షులు ముత్యాల సర్వయ్య, లోకసాని తిరపతయ్య, వేముల రాజు, బోడ్డుపల్లి కృష్ణ, హన్మంత్ శ్రీనివాస్ గౌడ్, హన్మంత్ రాఘవేందర్ గౌడ్, హన్మంత్ సాయి, బోయపల్లి శ్రీనివాస్ గౌడ్, రాఘవ చారి, గాజుల రాజేష్, వాడిత్య డిప్ల, చింతపల్లి పుల్లయ్య, అభిషేక్, బోయపల్లి రాములు గౌడ్, చిత్రం ఏసోబు, అంజి, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM