చరిత్రగల ముత్యాల దేవాళయం పునర్నిర్మాణం

byసూర్య | Mon, Dec 05, 2022, 11:31 AM

కంటోన్మెంట్ బోర్డు 1 వ వార్డ్ పరిధిలోని బోయినపల్లి బాపూజి నగర్ లో గల ముత్యాలమ్మ దేవాలయం నిర్మించి 30 యేండ్లు గడిచింది. దేవాలయం శిథిలావస్థకు చేరుకుంటుండటంతో పాటు ఈ ప్రాంతం లో రోడ్ విస్తరణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆలయం ను పునర్నిర్మాణం చేయాలనీ ఆలయకమిటీ నిర్ణయించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం ఆలయ కమిటీ సభ్యులతో కలిసి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్. ఆలయ ప్రసిడెంట్ దుర్గయ్య , ఆలయాన్ని పరిశీలించారు.

కాగా నూతనంగా నిర్మించనున్న ఆలయ ముఖచిత్రాన్ని( ప్లాన్) తో కూడిన పలు పత్రలకు ప్రత్యేక పూజలు నిర్వ్హయించారు. అనంతరం వాటిని పరిశీలించి ఈ నిర్మాణ పనులకు కావలిసిన నిధులు వాటి సమీకరణాల పైన చర్చించారు. ఈ సందర్బంగా జంపన్న ప్రతాప్ మాట్లాడుతూ. ఆలయం పునర్నిర్మాణ పనులకు , హిందూ సంఘాలు , భక్తులు , దాతల సహాయ సహకారాలు అందించాలని అన్నారు. దాతలు ముందుకు రావాలని దాతలు ఆలయ పునర్నిర్మాణము కోసం వస్తురూపేణ గని నిధుల రూపేణా గని అందించవచ్చని ఈ సంధర్బంగా కోరారు. కార్యక్రమం లో కొమురయ్య , నగేష్ , మల్లేష్ ఆలయ పూజారి సన్నిధానం సంతోష్ , కాంపల్లి శ్రీకాంత్ , రామా రావు , ప్రేమ్ కుమార్ ముదిరాజ్ అజిత్ కళ్యాణ్ తదితరులు పాల్గున్నారు.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM