గురుకుల సొసైటీల పరిధిలో 9,096 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

byసూర్య | Sat, Nov 26, 2022, 08:35 PM

తెలంగాణలోని నిరుద్యోగులకు ఇదో శుభవార్త. తెలంగాణలోని గురుకుల విద్యాసంస్థల్లో ఖాళీల భర్తీ ప్రక్రియలో వేగం పెరిగింది. రాష్ట్రంలోని నాలుగు సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో 9,096 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఇందులో బోధన, బోధనేతర పోస్టులు ఉన్నాయి. అయితే, గిరిజన రిజర్వేషన్ల సమస్యతో పాటు ఇతర అవాంతరాలతో నోటిఫికేషన్ల జారీ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా, మరో వారం రోజుల్లో.. అంటే డిసెంబర్ లో గురుకులాల్లోని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు సమాచారం.


రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలను గురుకుల సొసైటీలు నియామక బోర్డుకు సమర్పించాయి. వీటిపై పోస్టుల వారీగా రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల వివరాల పరిశీలనకు బోర్డు సిద్ధమైంది. వారం రోజుల్లో ఈ పరిశీలన పూర్తిచేసి, లోటుపాట్లను సవరించి నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించింది. దీంతో గురుకుల విద్యాసంస్థల ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రాధాన్యతాక్రమంలో నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ ప్రక్రియను పూర్తిచేయాలని గురుకులాల నియామక బోర్డు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.


Latest News
 

ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యంలో తగవు: షర్మిల Sat, Mar 25, 2023, 09:38 PM
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ,,,ప్రశాంత్ రెడ్డి అరెస్ట్ Sat, Mar 25, 2023, 09:37 PM
రంజాన్ ఉపవాస దీక్షుల కోసం.... రుచికరమైన...నాణ్యమైన హలీమ్,,,అందుబాటులోకి తీసుకొచ్చిన పిస్తా హౌస్ Sat, Mar 25, 2023, 08:35 PM
మెరుగైన ప్రయాణం కోసం టీఎస్ ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులు,,,ఈనెల 27న ప్రారంభం Sat, Mar 25, 2023, 07:33 PM
మెకానిక్ షెడ్డులో చెలరేగిన మంటలు,,,అబిడ్స్‌లో భారీ అగ్నిప్రమాదం Sat, Mar 25, 2023, 07:32 PM