బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

byసూర్య | Thu, Nov 24, 2022, 02:18 PM

కొందుర్గు మండలం ఉత్తరాస్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికీ పార్టీ కండవాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళుతున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుని ఏకైక పార్టీ బిఆర్ఎస్ అని అన్నారు. ఎస్. కె మహబూబ్ , ఎండి సాజిద్, ఎండి బాబు మియా, ఎండి తసుద్దీన్, ఎండి ముతాహ్, ఎస్కే సమీద్ , సిహెచ్ రమేష్, ఎం శేఖర్, బి శివకుమార్ , బి కవా కాశయ్య, కే వెంకటయ్య, బి నర్సి , ఎండి రియాజ్, ఎన్ కిష్టయ్య, కే రాజు, కే నరసింహ, కే సత్యం తదితరులు చేరారు .ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బంధులాల్, ఉత్తరాస్పల్లి సర్పంచ్ కుమారుడు ఖలీల్ , మాజీ సర్పంచ్ ఇబ్రహీం , అక్బర్, హలీం కృష్ణ, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Latest News
 

కవితాకు సీబీఐ నోటీసు..కానీ విచారణ కోసం కాదు వివరణ కోసమటా Fri, Dec 02, 2022, 11:49 PM
టీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కె.కవితకు సీబీఐ సమన్లు జారీ Fri, Dec 02, 2022, 11:15 PM
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం Fri, Dec 02, 2022, 10:33 PM
తీవ్ర ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి Fri, Dec 02, 2022, 09:05 PM
పోస్టులతో భర్తీతో సమస్యలపై మరింత దృష్టి సారించే అవకాశం Fri, Dec 02, 2022, 08:42 PM