![]() |
![]() |
byసూర్య | Thu, Nov 24, 2022, 10:55 AM
తెలంగాణలో రానున్న వారం రోజుల పాటు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణ మినహా రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. ఈ ప్రభావంతో దక్షిణ తెలంగాణ జిల్లాలలో గురువారం తేలికపాటి వర్షం పడుతుందని అంచనా వేసింది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉంటుందని, ఈ నెల 25 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా చలి మరింత పెరుగుతుందని వెల్లడించింది.