![]() |
![]() |
byసూర్య | Wed, Nov 23, 2022, 11:32 AM
తెలంగాణలోని మెదక్ జిల్లాలో హత్య కేసును పోలీసులు ఛేదించారు. కౌడిపల్లి మండలం కొయ్యగుండాలో శ్రీను, దేవి దంపతులు ఉన్నారు. దేవికి పలువురితో ఎఫైర్ ఉంది. దీనిపై దంపతులిద్దరికీ గొడవలు జరుగుతున్నాయి. నవంబర్ 18న కొందరితో శ్రీను గొడవ పడ్డాడు. అదే రోజు రాత్రి శ్రీనును భార్య దేవి చంపేసి హత్యగా నమ్మించింది. ప్రత్యర్థులు చంపేశారని ఆరోపించింది. విచారణలో హంతకురాలు భార్యేనని తేలడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.