ఫారెస్ట్ రేంజర్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం కెసిఆర్

byసూర్య | Tue, Nov 22, 2022, 08:32 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం ఎర్రగూడ అటవీ ప్రాంతంలో ఫారెస్టు రేంజర్ శ్రీనివాసరావును గుత్తికోయలు హత్య చేసిన సంగతి తెలిసిందే. అటవీ భూముల్లో పోడు వ్యవసాయం విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో గుత్తికోయలు శ్రీనివాసరావుపై కత్తులు, వేట కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఈ ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అటవీ అధికారి శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించారు. అంతేకాదు శ్రీనివాసరావు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, పదవీ విరమణ వయస్సు వరకు జీతం ఇస్తామని వెల్లడించారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM