byసూర్య | Sat, Sep 24, 2022, 07:52 PM
మైనర్లను పబ్ లలోకి అనుమతించొద్దని సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. కమీషనరేట్ పరిధిలోని పబ్ యాజమాన్యంతో సమావేశమై కోర్టు నిబంధనలు వివరించారు. రాత్రి 10 గంటల తర్వాత సౌండ్ పొల్యూషన్ లేకుండా చూడాలని ఆదేశించారు. స్థానికుల నుంచి ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా.. చర్యలు తీసుకుంటామని సీపీ వార్నింగ్ ఇచ్చారు. పట్లను బాధ్యతాయుతంగా నిర్వహించి హైదరాబాద్ ఖ్యాతిని నిలబెట్టాలని కోరారు.