అధికారులతో జెడ్పీ చైర్ పర్సన్ సమీక్ష సమావేశం

byసూర్య | Fri, Sep 23, 2022, 12:47 PM

రంగా రెడ్డి జిల్లాలో 54 వేలకు పైగా లబ్ధిదారులకు పింఛన్లను అందిస్తున్నామని జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఆమె గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్య శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. అర్హులై ఉండి పింఛన్లు అందని వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలకు వెంటనే మంజూరు చేయాలని ఆదేశించారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు. స్వయం సహాయక బృందాలుగా పనిచేస్తున్న మహిళా సంఘాల పనితీరుపైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

డ్రగ్స్ అమ్మేవారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని, ఎవరైనా డ్రగ్స్ అమ్ముతున్నట్లు తెలిస్తే 9963661112 నంబర్ కు సమాచారం అందించాలని ఆమె సూచించారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ కాన్పులు అయ్యేలా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగామహాన కల్పించాలన్నారు. షాదనగర్ జనరల్ ఆస్పత్రికి గ్రామీణ ప్రాంతాల నుండి పేదలు వైద్యం కొరకు ఎక్కువగా వస్తుంటారు. కాబట్టి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఇరిగేషన్ శాఖ అధికారుల పనితీరుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, మండలాల వారీగా ఎంపీపీ జడ్పీటీసీ స్థానిక ప్రతినిధులతో సమావేశమై విద్యుత్ సంబంధిత సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆమె సూచించారు.


Latest News
 

తెరాస పాలనలో ఆలయాలకు మహర్దశ : ఎమ్మెల్యే Tue, Oct 04, 2022, 05:29 PM
మున్సిపల్ చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్ ను అభినందించిన మంత్రి కేటీఆర్ Tue, Oct 04, 2022, 04:56 PM
మునుగోడులో ప్రచారంపై తేల్చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి Tue, Oct 04, 2022, 04:46 PM
మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితంలో ఆనందం Tue, Oct 04, 2022, 04:22 PM
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల మూసివేత Tue, Oct 04, 2022, 03:58 PM