బండి సంజయ్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి

byసూర్య | Fri, Sep 23, 2022, 12:45 PM

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని టీపీసీసీ కార్యదర్శి జక్కిడి ప్రభాకర్ రెడ్డి , లింగోజిగూడ కార్పొరేటర్ దర్పెల్లి రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం సాయంత్రం మన్సూరాబాద్ ఎస్కే గార్డెన్స్ లో వారు విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ప్రజలకు అసత్యాలు చెబుతూ మోసం చేస్తోందని ఆరోపించారు. జీహెచ్ఎంసీలో 48 మంది బీజేపీ కార్పొరేటర్లను గెలిపిస్తే కేంద్ర నుంచి ఎన్ని నిధులు తెచ్చారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. స్థానిక బీజేపీ కార్పొరేటర్లు ఇక్కడి ప్రజలకు ఏం చేశారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డివిజన్ అధ్యక్షుడు బుడ్డ సత్యనారాయణ, గుర్రం శ్రీనివాస్ రెడ్డి, మల్లా రపు శ్రీనివాస్. నాయకులు ఇరిగి రమేష్, ఎర్రంబెల్లి సతీష్ రెడ్డి, స్వామిగౌడ్, శ్రీదర్ గౌడ్, సత్యనారాయణరెడ్డి, ఎండీ షరీఫ్, లాలయ్య, ఎంఆర్కె రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తెరాస పాలనలో ఆలయాలకు మహర్దశ : ఎమ్మెల్యే Tue, Oct 04, 2022, 05:29 PM
మున్సిపల్ చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్ ను అభినందించిన మంత్రి కేటీఆర్ Tue, Oct 04, 2022, 04:56 PM
మునుగోడులో ప్రచారంపై తేల్చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి Tue, Oct 04, 2022, 04:46 PM
మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితంలో ఆనందం Tue, Oct 04, 2022, 04:22 PM
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల మూసివేత Tue, Oct 04, 2022, 03:58 PM