అంతర్రాష్ట్ర రహదారిపై రోడ్డు ప్రమాదం

byసూర్య | Fri, Sep 23, 2022, 12:49 PM

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తా సమీపంలో అంతరాష్ట్ర రహదారి అయిన అయిజ, కర్నూలు మార్గమధ్యంలో ఉన్న సబ్ స్టేషన్ దగ్గర శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. మానవపాడు మండలం చిన్న పోతులపాడు గ్రామానికి చెందిన మద్దిలేటి, మల్దకల్, రంగన్న ఈ ముగ్గురు పొలానికి బయలుదేరారు. సబ్ స్టేషన్ దగ్గర రోడ్డుపై ద్విచక్ర వాహనం ఆపి ఫోన్లో మాట్లాడుతుండగా. వెనకనుంచి వచ్చి మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్దకల్, మద్దిలేటి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం కర్నూలులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి అలంపూర్ చౌరస్తా చెక్ పోస్ట్ పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.


Latest News
 

కేసీఆర్ రాజ‌కీయంగా వేసే అడుగుల‌న్నీ బీజేపీకి ఉప‌యోగప‌డేలా ఉన్నాయి. Thu, Sep 29, 2022, 04:15 PM
కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు Thu, Sep 29, 2022, 04:14 PM
వెయ్యికి పైగా ఎంబీబీఎస్ బీ -కేట‌గిరి సీట్లు తెలంగాణ విద్యార్థులకే Thu, Sep 29, 2022, 04:13 PM
విద్యార్థుల కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి మల్లారెడ్డి Thu, Sep 29, 2022, 04:10 PM
దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన డిప్యూటీ మేయర్ Thu, Sep 29, 2022, 03:20 PM