ఏడాదిలోగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి: మంత్రి నిరంజన్‌ రెడ్డి

byసూర్య | Fri, Sep 23, 2022, 12:01 PM

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ఏడాదిలోగా పూర్తవుతాయని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. సమైక్య పాలనలో దశాబ్దాల పాటు పక్కనపెట్టిన పెండింగ్ ప్రాజెక్టులను స్వరాష్ట్రంలో శరవేగంగా పూర్తి చేశామన్నారు. కాళేశ్వరం నిర్మాణంతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయిందని చెప్పారు. వనపర్తి జిల్లా కేంద్రంలో మార్నింగ్‌ వాక్‌లో భాగంగా తాళ్లచెరువు, లక్ష్మీకుంట పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రారంభమయితే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కోనసీమను మించిపోతుందని చెప్పారు.దశాబాద్దాలుగా చెరువులు, కుంటలు నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలిపారు. తాగునీటికి కూడా తండ్లాడే పరిస్థితిని ఎదుర్కొన్నామని చెప్పారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత రాష్ట్రంలోని నీటివనరులను ప్రభుత్వం పటిష్టపరిచిందని వెల్లడించారు. దీంతో నాడు వందల ఫీట్లు బోర్లు వేసినా చుక్క నీరు రాలేదని.. నేడు పునాదులు తవ్వితే భూగర్భజలాలు ఎగసిపడుతున్నాయని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ సాగునీటిరంపై దృష్టిసారించడంతోనే ఇది సాధ్యమయిందన్నారు. వనపర్తి జిల్లా కేంద్రానికి భవిష్యత్‌లో నీటి ఎద్దడి రాకుండా పట్టణం చుట్టూ చెరువులను పటిష్టం చేశామన్నారు.


 


 


Latest News
 

తెరాస పాలనలో ఆలయాలకు మహర్దశ : ఎమ్మెల్యే Tue, Oct 04, 2022, 05:29 PM
మున్సిపల్ చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్ ను అభినందించిన మంత్రి కేటీఆర్ Tue, Oct 04, 2022, 04:56 PM
మునుగోడులో ప్రచారంపై తేల్చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి Tue, Oct 04, 2022, 04:46 PM
మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితంలో ఆనందం Tue, Oct 04, 2022, 04:22 PM
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల మూసివేత Tue, Oct 04, 2022, 03:58 PM