బతుకమ్మ పాటను విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత

byసూర్య | Thu, Sep 22, 2022, 12:53 PM

బతుకమ్మ పండుగ సందర్భంగా “సిరిమల్లెలో రామ రఘుమెల్లెలో” అనే బతుకమ్మ ప్రత్యేక గీతాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం నాడు ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈ గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ పాటను రూపొందించిన జేన్నారం జెడ్పిటిసి ఎర్ర శేఖర్ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌ దీపికారెడ్డి , ఉర్దూ అకాడమీ చైర్మన్ మూజీబ్ , హాజ్ కమిటీ చైర్మన్ సలీం , టియస్ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్ పాల్గొన్నారు.


 


Latest News
 

తెరాస పాలనలో ఆలయాలకు మహర్దశ : ఎమ్మెల్యే Tue, Oct 04, 2022, 05:29 PM
మున్సిపల్ చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్ ను అభినందించిన మంత్రి కేటీఆర్ Tue, Oct 04, 2022, 04:56 PM
మునుగోడులో ప్రచారంపై తేల్చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి Tue, Oct 04, 2022, 04:46 PM
మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితంలో ఆనందం Tue, Oct 04, 2022, 04:22 PM
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల మూసివేత Tue, Oct 04, 2022, 03:58 PM