![]() |
![]() |
byసూర్య | Mon, Aug 15, 2022, 11:12 PM
ఓ ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్తుండగా కర్నాటక రాష్ట్రంలో జరిగిన ప్రమాదంలో హైదరాబాదీలు దుర్మారణం చెందారు. కర్ణాటకలోని బీదర్ జిల్లా బంగూర్ వద్ద జాతీయ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మృతులు హైదరాబాదు బేగంపేటకు చెందినవారిగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. గిరిధర్ (45), అనిత (30), ప్రియ (15), మహేశ్ (2), జగదీశ్ (35) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీరంతా కలబురిగి జిల్లా గంగాపూర్ దత్తాత్రేయ ఆలయ సందర్శనకు కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు ఓ కంటైనర్ ను వెనుకనుంచి ఢీకొన్నది.