గురువారం మంత్రులతో సీఎం కేసీఆర్ కేబినెట్ సమావేశం

byసూర్య | Tue, Aug 09, 2022, 05:00 PM

గురువారం తెలంగాణ మంత్రి వర్గం సమావేశం కానుంది. ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి మంత్రులు హాజరుకానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి కావాల్సిన అదనపు వనరులతో పాటు రాష్ట్రంలో అమలౌతున్న సమంక్షేమ పథకాలు, అభివృద్ధిపై చర్చించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 15 వందల కోట్ల లోటు బడ్జెట్‌లో ఉండటంతో దానిపై కూడా చుర్చించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రుణాలు తెచ్చుకోవడానికి పరిమితి విధించడంపై కూడా మంత్రి వర్గంలో చెర్చించనున్నారు.

మరోవైపు ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీ కండువా కప్పుకోవడానికి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సిద్ధంగా ఉండటంతో మునుగోడు అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఐతే రానున్న ఉప ఎన్నికల భరిలో ఎవరిని దించాలనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తుంది. బై పోల్స్‌లో గుత్తా సుఖేందర్‌ రెడ్డి పేరు వినిపిస్తుంది. చూడాలి మరి సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM