బస్తీలలో వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: మంత్రి తలసాని

byసూర్య | Sat, Aug 06, 2022, 02:16 PM

దేశానికి స్వాతంత్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అన్ని కాలనీలు, బస్తీలలో వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసంలో నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్ లు, టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 33 వ తేదీ వరకు నిర్వహించే స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం వేడుకలను ఈ నెల 8 వ తేదీన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హై టెక్స్ లో ప్రారంభిస్తారని చెప్పారు.

అందులో భాగంగా ఈ నెల 9 వ తేదీన ఇంటింటికి జాతీయ పతాకాల పంపిణీ, 10 న మొక్కలు నాటడం, 11 న ఫ్రీడమ్ రన్, 12 న రాఖీ సందర్భంగా వివిధ మీడియా సంస్థల ద్వారా ప్రత్యేక కార్యక్రమాల ప్రసారం, 13 న విద్యార్థులు, యువతీయువకులు, మహిళలు వివిధ వర్గాల భాగస్వామ్యం తో వజ్రోత్సవ ర్యాలీలు, 14 న నియోజకవర్గ కేంద్రాలలో సాంస్కృతిక, జానపద కార్యక్రమాలు, బాణసంచా కాల్చడం, 15 న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, 16 న ఏక కాలంలో సామూహిక జాతీయ గీతాలాపన, 17 న రక్తదాన శిబిరాల నిర్వహణ, 18 న క్రీడల నిర్వహణ, 19 దవాఖానాలు, అనాధ ఆశ్రమాలు, జైళ్లలో పండ్లు, స్వీట్ల పంపిణీ, 20 న ముగ్గుల పోటీలు, 21 న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, స్థానిక సంస్థల సమావేశాలు ఉంటాయని మంత్రి వివరించారు.

22 వ తేదీన ఎల్బీ స్టేడియంలో వజ్రోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమం నిర్వహించబడుతుందన మంత్రి చెప్పారు. మీ మీ డివిజన్ లలో ఎంతో ఘనంగా వేడుకలను జరపాలని, ఈ వేడుకలలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు అయ్యే విధంగా చూడాలని అన్నారు. 17 వ తేదీన నిర్వహించే రక్తదాన శిభిరాలలోపెద్ద సంఖ్యలో రక్తదానం చేసేందుకు ముందుకొచ్చేలా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మీ, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, కొలన్ బాల్ రెడ్డి, వెంకటేష్ రాజు, నాయకులు శేఖర్, పుట్టల శేఖర్, నాగులు, శ్రీహరి, జై రాజ్, సత్యనారాయణ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM