టీఆర్‌ఎస్‌ శక్తివంతమైన పార్టీ: ఎమ్మెల్యే

byసూర్య | Thu, Jul 07, 2022, 04:57 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని నెహ్రూనగర్ కు చెందిన కాంగ్రెస్ నాయకులు అన్నం సుభాష్, శ్రీనివాస్, శివ కుమార్, మోహన్, యేసు, నారాయణ, చిన్ని, రాజ్ కుమార్ లు టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సమక్షంలో ఎమ్మెల్యే నివాసం వద్ద కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ శక్తివంతమైన పార్టీ అని, అందరి చూపు టీఆర్‌ఎస్‌ వైపే ఉందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధినాయకత్వంలో, వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సారధ్యంలో టీఆర్‌ఎస్‌ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి అనేక మంది టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. కష్టపడ్డ వారికి పార్టీలో సముచిత స్థానం తప్పక లబిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, దుండిగల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రుద్ర అశోక్, శ్రీకాంత్, సీనియర్ నాయకులు సయ్యద్ రషీద్, కృష్ణ గౌడ్, మారయ్య, కుంట సిద్ధిరాములు, సుదర్శన్ రెడ్డి, వేణుయాదవ్, సూరారం డివిజన్ ప్రధాన కార్యదర్శి సిద్ధిక్, నాయకులు మధుమోహన్, ప్రశాంత్, దశరథ్, చెట్ల వెంకటేష్, ఇమ్రాన్ బైగ్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

Latest News
 

తెలంగాణ రెయిన్ అలెర్ట్ Mon, Aug 08, 2022, 09:35 PM
తెలంగాణ విద్యార్థులు అలర్ట్ Mon, Aug 08, 2022, 09:23 PM
తెలంగాణ కరోనా అప్డేట్ Mon, Aug 08, 2022, 09:17 PM
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ Mon, Aug 08, 2022, 09:04 PM
విజృంభిస్తున్న కరోనా.. జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు Mon, Aug 08, 2022, 05:31 PM