పెరుగుతున్న కరోనా కేసులు..హైదరాబాద్ లోనే ఎక్కువ

byసూర్య | Mon, Jul 04, 2022, 12:12 AM

కరోనా కేసులు  పెరుగుతున్న నేపథ్యంలో మరింత  జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు వైద్యులు సూచిస్తున్నారు. తెలంగాణలో గడచిన 24 గంటల్లో 22,384 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, 457 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. హైదరాబాదులో అత్యధికంగా 285 కొత్త కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 35, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27, రంగారెడ్డి జిల్లాలో 25 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 494 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 8,02,379 మంది కరోనా బారినపడగా, వారిలో 7,93,521 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,747 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 4,111 మంది మరణించారు.


Latest News
 

తెలంగాణ విద్యార్థులు అలర్ట్ Mon, Aug 08, 2022, 09:23 PM
తెలంగాణ కరోనా అప్డేట్ Mon, Aug 08, 2022, 09:17 PM
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ Mon, Aug 08, 2022, 09:04 PM
విజృంభిస్తున్న కరోనా.. జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు Mon, Aug 08, 2022, 05:31 PM
కార్వాన్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ ర్యాలీ Mon, Aug 08, 2022, 05:30 PM