నెలలో 20 రోజులు కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే: జి.కిషన్ రెడ్డి

byసూర్య | Mon, Jul 04, 2022, 12:13 AM

కేసీఆర్ నెలలో 20 రోజులు ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఆరేళ్లలో ఒక్కరోజు కూడా సచివాలయానికి రాలేదని ఆరోపించారు. సచివాలయానికి రాని సీఎం దేశంలో కేసీఆర్ ఒక్కరేనని విమర్శించారు. తెలంగాణలో ఉన్నది తండ్రీకొడుకుల నిరంకుశ సర్కారు అని వ్యాఖ్యానించారు. హైదరాబాదులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, నగరంలో ఫ్లెక్సీ వార్ జరుగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి పరస్పర విమర్శల దాడి తీవ్రతరం చేశాయి. దీనిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. అధికారులు బీజేపీ ఫ్లెక్సీలపై భారీగా జరిమానాలు వేశారని, టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. 


ప్రగతి భవన్ లోకి మంత్రులకు ఎవరికీ ప్రవేశం లేదని, కానీ ఎంఐఎం అధినేత నేరుగా ప్రగతి భవన్ లోకి వెళ్లి సీఎంను కలుస్తారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ అసదుద్దీన్ ఒవైసీ చేతిలో ఉందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 


జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వరదల పేరిట ఇంటింటికీ రూ.10 వేలు పంచారని, ఎన్నికలు పూర్తయ్యాక వరద బాధితులకు సాయం ఆపేశారని మండిపడ్డారు. వాస్తు పేరుతో సచివాలయం పడగొట్టి వందల కోట్లు వృథా చేశారని కిషన్ రెడ్డి విమర్శించారు. మంత్రిమండలిలో ఐదేళ్లపాటు ఒక్క మహిళకూ స్థానంలేదని, ఎనిమిదేళ్లుగా గ్రామపంచాయతీలకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని అన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు పంచారని ఆరోపించారు. అయితే, హుజూరాబాద్ లో డబ్బు పంచకుండానే మంచి మెజారిటీతో గెలిచామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో అద్భుతమైన మార్పు రాబోతోందని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావడం తథ్యమని అన్నారు.


Latest News
 

తెలంగాణ కరోనా అప్డేట్ Sun, Oct 02, 2022, 10:28 PM
టీఆర్ఎస్ పార్టీ నేతలతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం Sun, Oct 02, 2022, 09:10 PM
అప్పుడు నేను గాంధీనే గుర్తు చేసుకునేవాడిని... సీఎం కేసీఆర్ Sun, Oct 02, 2022, 06:19 PM
గొప్ప విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్... నటుడు ప్రకాష్ రాజ్ ప్రశంస Sun, Oct 02, 2022, 06:18 PM
దసరా రోజున టిఆర్ఎస్ ఎల్పి సమావేశం... అదే రోజు జాతీయ పార్టీ ప్రకటన Sun, Oct 02, 2022, 06:17 PM