పీఆర్వోపై ఆరోపణలు...విధుల నుంచి తొలగించిన మంత్రి గంగుల

byసూర్య | Thu, Jun 23, 2022, 03:03 PM

ఆడియో రికార్డు తో అడ్డంగా బుక్కాయిన ఓ మంత్రి పీఆర్ఓ చివరకు తన ఉద్యోగాన్ని పోగొట్టుకొన్నాడు. ఓ నిందితుడికి బెయిల్ ఇప్పించేందుకు మంత్రి పీఆర్‌వో ఒకరు డబ్బులు డిమాండ్ చేశారు. అయితే, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, బయటకు తెలిస్తే పోలీసులకు చెడ్డపేరు వస్తుందంటూ పీఆర్‌వో చెప్పడం ఆ ఆడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. మొత్తంగా 3.53 నిమిషాల నిడివి ఉన్న రెండు ఆడియో క్లిప్స్ వెలుగులోకి వచ్చాయి. అయితే, సదరు వ్యక్తి తాను మంత్రికి పీఆర్వో అయినప్పటికీ, పీఏనని చెప్పుకున్నాడు.  దీనిపై మంత్రి గంగుల వెంటనే స్పందించారు. తన పీఆర్వోను విధుల నుంచి తొలగించారు.


కరీంనగర్‌లో అనుమతులు లేని తాగునీటి శుద్ధి కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన వాటిపై కేసులు నమోదు చేశారు. ఇలాంటి ఒక కేసులో అరెస్ట్ అయిన బాధితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు మంత్రి గంగుల కమలాకర్ పీఆర్‌వో మల్లికార్జున్ రంగంలోకి దిగారు.  తాను ఇప్పుడే ఏసీపీతో మాట్లాడానని, స్టేషన్ బెయిల్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. స్టేషన్‌కు వెళ్లి మంత్రి పీఏ మల్లికార్జున్ సార్ చెప్పాడని పోలీసులకు చెబితే బెయిలు ఇస్తారని పేర్కొన్నారు. అయితే, ఇందుకు కొంతమొత్తం ఖర్చవుతుందని, ఏసీపీ, సీఐలకు కూడా అడ్జస్ట్ చేయాలని మల్లికార్జున్ చెప్పుకొచ్చారు. డబ్బులు మాత్రం వెంటనే ఇవ్వాలని, ఎంత అనేది తాను తర్వాత చెబుతానని పేర్కొన్నారు. 


అయితే, ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దని, చెబితే పోలీసులకు చెడ్డపేరు వస్తుందని హెచ్చరించారు. ఆడియో వైరల్ కావడంతో మంత్రి గంగుల స్పందిస్తూ.. విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే పీఆర్‌వోను విధుల నుంచి తప్పించినట్టు చెప్పారు. ఈ విషయమై డీసీపీ నేతృత్వంలో పూర్తిస్థాయి విచారణ చేయించనున్నట్టు కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM