తల్లిదండ్రులు దూరమయ్యారని....ఆ కొడుకులిద్దరూ తనువు చాలించారు

byసూర్య | Thu, Jun 23, 2022, 03:05 PM

ఏ పిల్లలకైనా కొండత నీడ అమ్మా, నాన్న. ఈ రెండు పదాలు మనకు శాశ్వతంగా దూరమైనట్లు అనిపిస్తే ఆ వేదన వర్ణతీతం. తల్లి అనారోగ్యంతో చనిపోవడంతో తట్టుకోలేకపోయారు ఆ ఇద్దరు అన్నదమ్ములు.. తండ్రి కూడా మరో పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో మరింత కుంగిపోయారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులిద్దరికీ దూరమయ్యామని కుమిలిపోయారు. ఏడెనిమిది నెలలపాటు ఆ ఆవేదన చెంది చివరికి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది.


వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని రాంపల్లి దాయర గ్రామానికి చెందిన మెట్టు శ్రీనివాస్‌ రెడ్డి, ప్రమీల దంపతులకు మాధవరెడ్డి, యాదిరెడ్డి, మహిపాల్‌రెడ్డి ముగ్గురు సంతానం. వీరిలో యాదిరెడ్డి (34), మహిపాల్‌రెడ్డి (29) హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ మ్యూజిక్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పియానో టీచర్లుగా ఉద్యోగం చేస్తూ హైటెక్‌ సిటీ వద్ద ఉంటున్నారు. వారానికోసారి ఇద్దరూ రాంపల్లి దాయరకు వచ్చి, వెళ్తుండేవారు. వీరి తల్లి ప్రమీల కేన్సర్‌ బారిన పడి కొద్ది నెలల కింద చనిపోయారు. ఈ క్రమంలోనే తండ్రి మరో వివాహం చేసుకొని వేరే ఊరికి వెళ్లిపోయారు. దీంతో.. తల్లిదండ్రులిద్దరి ప్రేమనూ కోల్పోయామంటూ యాదిరెడ్డి, మహిపాల్‌రెడ్డి బాధపడేవారు.


ఈ క్రమంలోనే వారు మంగళవారం రాంపల్లి దాయరలోని తమ ఇంటికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు గ్రామంలోని స్నేహితులు, బంధువులు, చుట్టుపక్కల వారితో గడిపారు. ఆ తర్వాత ఇద్దరూ ఇంట్లోకి వెళ్లిపోయారు. ఇటు వారి అన్న మాధవరెడ్డి.. ఇద్దరికీ ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా కలవకపోవడంతో గ్రామంలోని ఒకరికి ఫోన్‌ చేసి ఇంటికెళ్లి కనుక్కోమని చెప్పగా.. ఆయన వారి ఇంటికెళ్లి చూడగా హాల్‌లో యాదిరెడ్డి ఫ్యాన్‌కు ఉరేసుకొని.. బెడ్రూంలో మహిపాల్‌ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అక్కడికి చేరుకున్న వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాల్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ‘మా చావుకి ఎవరూ కారణం కాదు.. తల్లి ప్రేమ దూరం కావడంతో మనస్తాపానికి, ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకుంటున్నాం’ అని రాసిన సూసైడ్‌ ‌నోట్ అక్కడ దొరికింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు Fri, Jul 01, 2022, 08:57 AM
సర్పంచ్ సహా ముగ్గురిపై కేసు Fri, Jul 01, 2022, 08:57 AM
రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలు Fri, Jul 01, 2022, 08:52 AM
నేడు కాంగ్రెస్ సోషల్ మీడియా సమావేశం Fri, Jul 01, 2022, 08:51 AM
నాన్ స్టాప్ బస్ సౌకర్యం కల్పించాలి Fri, Jul 01, 2022, 08:49 AM