శంషాబాద్ లోనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల: ఎంపీ

byసూర్య | Thu, Jun 23, 2022, 09:37 AM

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుపై ఉత్కంఠకు తెరపడింది. శంషాబాద్ లోనే ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రారంభిస్తున్నట్లు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి స్పష్టం చేశారు. దోస్త్ నోటిఫికేషన్ వెలువడిన అనంతరం ప్రవేశాలను కూడా స్వీకరించేందుకు తగిన ఏర్పాట్లు జరిగినట్లు ప్రకటిచారు. డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయనున్న భవనంలో ఆయన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిసి మాట్లాడారు. విద్యా వ్యవస్థపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా శంషాబాద్ వాసుల చిరకాల వాంఛ నెరవేరుతోందన్నారు. ప్రస్తుతం ప్రారంభించనున్న డిగ్రీ కళాశాలలో అన్ని కోర్సులకు కలిపి మొదటి విద్యా సంవత్సరానికి 240 సీట్లు కేటాయించినట్లు ఎంపీ తెలిపారు. మొత్తం అన్ని సీట్లు భర్తీ అయ్యేలా ప్రజా ప్రతినిధులు, నాయకులు కృషి చేయాలని లేదంటే కళాశాల మరో ప్రాంతానికి తరలించే అవకాశాలుంటాయని హెచ్చరించారు. న్యాకో, యూజీసీ గుర్తింపు అనంతరం కళాశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు అవుతాయని వివరించారు.

పట్టణంలోని ప్రభుత్వ దవాఖానాను 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికతో పాటు నిధులు సిద్ధంగా ఉన్నాయన్నారు. అంతకు ముందు ప్రభుత్వ బాలుర పాఠశాల వద్ద మన బస్తీ, మన బడి కార్యక్రమంలో పాల్గొని మౌలిక వసతుల కల్పనకు పాఠశాలకు నిధులు కేటాయించినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్పర్సన్ సుష్మా, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, నార్సింగి ఏఎంసీ చైర్మన్ వెంక టేష్ గౌడ్ కౌన్సిలర్లు రేఖ, అజయ్, వెంకటేష్, జహంగీర్ ఖాన్, టీఆర్ఎస్ నాయకులు గణేష్ గుప్తా, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్ రావు , నాయకులు మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM