ధరణి పై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని వీడాలి

byసూర్య | Thu, May 19, 2022, 03:43 PM

ధరణి సమస్య పరిష్కారానికై, సామాన్యూలు మోయలేని ధరణి ఫీజులను రద్దు చేయాలని గురువారం కోడేర్ మండల కేంద్రంలో ధరణి రద్దుకై రిలే నిరహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షుడు మల్యాల మురళిధర్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షుడు లింగన్ గౌడ్ మాట్లాడుతూ, ధరణి లో భూ పరిపాలన సేవలు ఉంచితం కాదని, మీ పేరు తప్పుగా నమోదు అయ్యిందా, మీ తండ్రి పేరులో ఓ అక్షరం తేడా ఉందా, కులం , ఇంటి పేరు, అంటూ సర్వే నెంబర్ మర్చిపోయారా అంటూ ప్రతి సారి సరిచేసుకోవటానికి దరఖాస్తు చేయాలంటే 1000 రూపాయల ఫీజులు ఇలాంటివి చాలా నిరుపేదలు చేలిస్తున్నారని అన్నారు.


రైతులు ధరణికి ముందు ఎలాంటి సమస్యలు లేవని ఇప్పుడు మీము ఫీజులు ఎందుకు చెల్లించాలంటే కుదరదని, పట్టా పాసుపుస్తకం జారీ చేసి , అందులో అందికారులు తప్పు డాట ఎంట్రీ చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా గతంలో భూయజమాని మరణాంతరం ఎలాంటి ఫీజు లేకుండా విరాసత్ ద్వారా వారసులకు పట్టా మార్పిడి జరిగేందని, ఇప్పుడు ఒక ఏకరా చొప్పున 2500/- రూపాయల అమోంట్ వసూలు చేస్తున్నారని అన్నారు. భూ పరిపాలన సేవలను ఉచితంగా అందించాల్సిన ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఫీజులను వసూలు చేస్తుందని, దీని ద్వారా ప్రతి యోటా కోట్లల్లో ఆదాయం సమకూర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నందని, ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం ధరణి అద్భుతం అంటూ కీర్తీస్తూనే కొత్త కొత్త ఆప్షన్లతో రైతులను ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంని, ధరణిలో తప్పుడు డాట ఎంట్రీ చేసి రైతులను ఇబ్బందులకు కారణమైన అధికారులను, ఉద్యోగుల పై చర్యలు తీసుకోని సమస్యల పరిష్కారం కోసం ఫిజులను రద్దు చేయాలని అన్నారు. లేకపోతే ధరణి ని రద్దు చేయాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతులు తమ గోడును చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ సమితి వ్యవస్థాపకుడు జస్టిస్ చంద్రకుమార్ అదేవిధంగా రైతులు, రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.


 


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM