సీఎం సహాయ నిధి నిరుపేదలకు భరోసా : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

byసూర్య | Thu, May 19, 2022, 03:46 PM

అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 23 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా రూ.19,08,500/- విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి ఈరోజు తన నివాసం వద్ద అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమానికి గౌరవ సీఎం కేసీఆర్‌ గారు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు యేటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం సంతోషంగా ఉందని తెలిపారు. సీఎం సహాయ నిధి నిరుపేదలకు భరోసానిస్తుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


Latest News
 

డిసెంబర్ 7 నుండి 9 వరకు జిల్లా స్థాయి ఇన్స్ పైర్ విద్యా వైజ్ఞానిక ప్రదర్శన : జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ Tue, Dec 06, 2022, 02:55 PM
ఘనంగా బాబాసాహెబ్ వర్ధంతి Tue, Dec 06, 2022, 02:42 PM
అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలి: సీపీ Tue, Dec 06, 2022, 01:14 PM
స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం.. Tue, Dec 06, 2022, 12:58 PM
రేపు ఆ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన Tue, Dec 06, 2022, 12:35 PM