బ్లాక్‌ఫంగస్‌ బాధితుడికి అరుదైన చికిత్స

byసూర్య | Tue, May 17, 2022, 08:50 AM

కొవిడ్‌ తర్వాత బ్లాక్‌ ఫంగస్‌ బారినపడి దవడ, పళ్లు కోల్పోయిన హహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన అమిత్‌ బిరాదర్‌ (42)కు అరుదైన శస్త్రచికిత్సతో కృత్రిమంగా అమర్చారు బోధన్‌కు చెందిన దంత వైద్యుడు శ్రీకాంత్‌ దేశాయ్‌. రూ.లక్షల ఖర్చుతో మహానగరాల్లో అందుబాటులో ఉండే చికిత్సను సవాలుగా తీసుకొని నామమాత్రపు ఖర్చుతో పూర్తి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. లాతుర్‌లో ఓ ప్రైవేటు విత్తన కంపెనీలో ఉద్యోగం చేసే అమిత్‌ బిరాదర్‌కు సెకెండ్‌ వేవ్‌లో కొవిడ్‌సోకి అపస్మారక స్థితికి చేరి 22 రోజులు చికిత్స తర్వాత కోలుకున్నారు. అనంతరం బ్లాక్‌ ఫంగస్‌ రావడంతో మూడు పళ్లు మినహా పైభాగం దవడ ఎముక మొత్తం పోయింది. సైనస్‌ ఎముక వరకు ఫంగస్‌ విస్తరించి తగ్గింది. తీవ్రమైన నొప్పి, వాపు, రక్తస్రావంతో అవస్థపడుతున్న అమిత్‌ మహారాష్ట్ర ఆస్పత్రుల్లో విఫలయత్నాలు చేసి చివరగా బోధన్‌లో డాక్టర్‌ శ్రీకాంత్‌ దేశాయ్‌ను సంప్రదించారు. కేసును సవాల్‌గా స్వీకరించిన డాక్టర్‌ బాధితుడికి తన ఇంటిపై గదిలో వారం రోజులు భోజనం, వసతి కల్పించి చికిత్స ప్రారంభించారు. బ్లాక్‌ ఫంగస్‌ తర్వాత పుర్రె భాగం ఎలా ఉందో 3డీ స్కానింగ్‌ ద్వారా నిర్ధారించుకొని వైద్యుడు చెవి కింద ఉన్న ఎముక (జైగోమాటిక్‌), (టెరిగాయిడ్‌) సాయంతో సహజత్వం ఉట్టిపడేలా కృత్రిమ పళ్లు అమర్చారు. ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స వృత్తిపరమైన సంతోషం కలిగించిందని వైద్యుడు శ్రీకాంత్‌ దేశాయ్‌ పేర్కొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM