కేంద్ర మంత్రి అమిత్ షా పై ట్విట్టర్ లో ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం

byసూర్య | Sat, May 14, 2022, 12:49 PM

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై చూపుతున్న వివక్షపై సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి అమిత్ షా ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణలో పర్యటించనున్న అమిత్ షాను వివిధ అంశాలపై ట్విట్టర్ వేదికగా కవిత ప్రశ్నించారు.


తెలంగాణకు కేంద్రం నుండి రావాల్సిన రూ. 3000 కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని, బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్: రూ. 1350 కోట్లు, జిఎస్టీ పరిహారం: రూ. 2247 కోట్ల సంగతేమిటి అని ప్రశ్నించారు. గత 8 సంవత్సరాలలో తెలంగాణకు ఒక్క ఐఐటీ, ఐఐఎం, ఐఐ ఎస్ ఈ ఆర్, ఐఐటి, ఎన్ ఐ డి మెడికల్ కాలేజీ లేదా నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందో తెలంగాణ బిడ్డలకు వివరించాలని అమిత్ షాను డిమాండ్ చేశారు.


 


Latest News
 

డయాలసిస్ కేంద్రం ప్రారంభించిన హరీష్ రావు Fri, May 20, 2022, 05:04 PM
కోడి ధరలు కొండెక్కాయి Fri, May 20, 2022, 05:00 PM
వ్యక్తి కిడ్నీలో 206 రాళ్లు Fri, May 20, 2022, 04:32 PM
తెలంగాణలో జనసేన పోటీ: పవన్ కళ్యాణ్ Fri, May 20, 2022, 04:21 PM
పదవ తరగతి విద్యార్థులకు టీఎస్ఆర్టీసి బంపర్ ఆఫర్ Fri, May 20, 2022, 03:47 PM