ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త!

byసూర్య | Sat, May 14, 2022, 12:27 PM

హైదరాబాద్‌లోని కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు ఎక్కువగా బస్సులోనే ప్రయాణిస్తున్నారు. అయితే పనులు ఆలస్యమైతే బస్సులు రావడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీఎస్ ఆర్టీసీ తెలిపింది. ఈ బస్సులు అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు రద్దీగా ఉండే రూట్లలో అందుబాటులో ఉంటాయి. ఈ బస్సులు డిపోకు చేరుకునే సమయానికి సాధారణ బస్సులు తిరిగి రోడ్డెక్కనున్నాయి. దీంతో 24 గంటలూ ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే వివిధ రూట్లలో రాత్రిపూట బస్సులను ప్రయోగాత్మకంగా నడుపుతున్న ఆర్టీసీకి ప్రయాణికుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా రాత్రి పూట నగరానికి వచ్చే వారికి, తెల్లవారుజామున దూర ప్రాంతాలకు వెళ్లే వారికి ఈ బస్సులు అనుకూలంగా ఉంటాయి. అర్ధరాత్రి నగరానికి వచ్చే ప్రయాణికులు ఆటోలు, క్యాబ్ లలో ప్రయాణించాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు ప్రయాణికుల భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఈ సందర్భంగా ఆర్టీసీ సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ వెంకన్న మాట్లాడుతూ.. తాము ప్రవేశపెట్టిన సిటీ బస్సులకు ప్రయాణికుల ఆదరణ లభిస్తోందని, డిమాండ్‌కు అనుగుణంగా నగరంలో మరిన్ని రూట్లలో ప్రవేశపెడతామని తెలిపారు.


Latest News
 

డయాలసిస్ కేంద్రం ప్రారంభించిన హరీష్ రావు Fri, May 20, 2022, 05:04 PM
కోడి ధరలు కొండెక్కాయి Fri, May 20, 2022, 05:00 PM
వ్యక్తి కిడ్నీలో 206 రాళ్లు Fri, May 20, 2022, 04:32 PM
తెలంగాణలో జనసేన పోటీ: పవన్ కళ్యాణ్ Fri, May 20, 2022, 04:21 PM
పదవ తరగతి విద్యార్థులకు టీఎస్ఆర్టీసి బంపర్ ఆఫర్ Fri, May 20, 2022, 03:47 PM