ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన సంక్షేమ సంఘం సభ్యులు

byసూర్య | Sat, May 14, 2022, 11:32 AM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని విష్ణుప్రియ ఎంక్లేవ్ కు చెందిన రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో ఎన్నో రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యకు సుమారు రూ.2 కోట్లతో పైపు లైన్లు, రూ.20 లక్షలతో పార్క్ అభివృద్ధి, రూ.11 లక్షలతో ఓపెన్ జిమ్ కు నిధులు మంజూరు చేసిన సందర్భంగా ఎమ్మెల్యే గారిని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయా పనులు వేగంగా ప్రారంభించాలని కోరారు. మిగిలిన సీసీ రోడ్లు, భూగర్భడ్రైనేజీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ హరికృష్ణ రెడ్డి మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.


 


 


Latest News
 

తెలంగాణలో 9,618 గ్రూప్ 4 ఖాళీల భర్తీపై కీలక ఆదేశాలు Thu, May 19, 2022, 05:11 PM
రేకుల ఇంటికి రూ.7.2 లక్షల కరెంటు బిల్లు! Thu, May 19, 2022, 05:03 PM
తగ్గిన బంగారం ధరలు Thu, May 19, 2022, 04:59 PM
ప్రియుడితో జవాన్ భార్య రాసలీలలు.. ఒక్కసారిగా ఆలా చూసి Thu, May 19, 2022, 04:27 PM
సింగరేణిలో పెండింగ్ లో ఉన్న వారసులకు ఉద్యోగాలు Thu, May 19, 2022, 04:17 PM