మహిళా ఉద్యోగికి లైంగిక వేధింపులు

byసూర్య | Sat, May 14, 2022, 11:12 AM

మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. చట్టాలున్నా కొందరు ఏదో ఒక రూపంలో మహిళా ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నారు. తాజాగా ఒప్పంద మహిళా ఉద్యోగిపై ఓ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మెదక్​ జిల్లాలో మార్చి 30న జరిగిన ఈ వ్యవహారం తాజాగా బయటకొచ్చింది.మెదక్ జిల్లాలో ఓ ఉద్యోగిని అవసరాన్ని ఆసరాగా తీసుకుని ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. ఒప్పంద విధానంలో అదే శాఖలో పని చేస్తున్న మహిళా ఉద్యోగిని లైంగిక వేధింపులకు గురిచేశాడు. తన ఉద్యోగాన్ని కొనసాగించే దస్త్రం మీద సంతకం పెట్టేందుకు కోరిక తీర్చాలని తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. ఆ అధికారి మాటలతో తీవ్ర మనోవేదనకు గురైన మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.


పని, బిల్లులిచ్చే విషయంలో తనను ఏడాదికాలంగా ఇబ్బంది పెట్టారని బాధిత మహిళా ఉద్యోగి తెలిపారు. అదంతా మరిచిపో. నిన్ను ఉద్యోగంలో కొనసాగించే దస్త్రం మీద సంతకం చేస్తా. నువ్వు చేయాల్సిందల్లా నా కోరిక తీర్చడమే. అలా చేస్తే నీకు ఏ కష్టం రాకుండా మహరాణిలా చూసుకుంటా. ఉద్యోగ విధులూ పెద్దగా లేకుండా చూస్తా అని తన పట్ల ఆ అధికారి వ్యవహరించిన తీరును బాధిత మహిళ మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యను కలిసి గోడు వెల్లబోసుకున్నానని, ఆమె సూచనల మేరకు జిల్లాస్థాయిలో కమిటీ విచారణ చేపట్టిందని చెప్పారు.


ఏప్రిల్‌ 5న సదరు కమిటీ తనను పిలిపించిందని తెలిపారు. మార్చి 30న ఏం జరిగింది, గతేడాది కాలంగా ఆ అధికారి తనను ఎలా ఇబ్బందులకు గురిచేస్తున్నారనేది కమిటీకి వివరించారు. ఇదంతా జరిగి నెల గడిచిపోయినా ఆ అధికారి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నిస్తున్నారు.


 


 


Latest News
 

డయాలసిస్ కేంద్రం ప్రారంభించిన హరీష్ రావు Fri, May 20, 2022, 05:04 PM
కోడి ధరలు కొండెక్కాయి Fri, May 20, 2022, 05:00 PM
వ్యక్తి కిడ్నీలో 206 రాళ్లు Fri, May 20, 2022, 04:32 PM
తెలంగాణలో జనసేన పోటీ: పవన్ కళ్యాణ్ Fri, May 20, 2022, 04:21 PM
పదవ తరగతి విద్యార్థులకు టీఎస్ఆర్టీసి బంపర్ ఆఫర్ Fri, May 20, 2022, 03:47 PM