ఇష్టంలేని పెళ్లి చేశారని నవ వధువు ఆత్మహత్య !

byసూర్య | Sat, May 14, 2022, 09:03 AM

ఉదయం బంధువులు, మిత్రుల సమక్షంలో పెళ్లి బాజాలు మోగిన ఆ ఇంట్లో. సాయంత్రానికి చావు డబ్బులు వినిపించాయి. తనకు ఇష్టంలేని పెళ్లి చేశారని నవ వధువు ఆత్మహత్య చేసుకోవడం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే. మహబూబ్ నగర్ పాత తోటకు చెందిన గజ్జల పద్మకు నలుగురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. భర్త పిల్లలు చిన్నవారుగా వున్నపుడే మరణించడంతో కూలి నాలి చేస్తూ పిల్లలను చదివిస్తూ వచ్చింది. తన పెద్ద కూతురు లక్ష్మి(19) కి వివాహం చేసి ఒక్కొక్కరి బాధ్యతను దించుకోవాలని ఆ తల్లి భావించింది. అందుకుగాను తమ దూరపు బంధువు అయినా అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన యువకునితో పెళ్లి సంబంధం ఖాయం చేశారు. అంత దూరం సంబంధం ఇవ్వడం నాకు ఇష్టం లేదని తల్లితో పలుమార్లు చెప్పినప్పటికీ లక్ష్మికి నచ్చజెప్పి వివాహానికి ఒప్పించారు.


 


శుక్రవారం ఉదయం బంధువులు, మిత్రుల మధ్య ఆనందంగా వివాహం జరిగింది. ఈ సందర్భంగా వరుడితో కలిసి లక్ష్మీ నృత్యాలు కూడా చేసింది. సాయంత్రం తనకు కడుపులో నొప్పి ఉందని పందిట్లో ఉన్న తన తల్లికి, ఇతర కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లుగా వైద్యులు నిర్ధారించారు. విషం తీసుకోవడం వల్లే లక్ష్మీ మరణించినట్లుగా గుర్తించారు. దీనితో పెళ్లి బాజాలు మోగిన ఆ ఇంట్లో చావు డబ్బులు వినవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. లక్ష్మి తల్లి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

డయాలసిస్ కేంద్రం ప్రారంభించిన హరీష్ రావు Fri, May 20, 2022, 05:04 PM
కోడి ధరలు కొండెక్కాయి Fri, May 20, 2022, 05:00 PM
వ్యక్తి కిడ్నీలో 206 రాళ్లు Fri, May 20, 2022, 04:32 PM
తెలంగాణలో జనసేన పోటీ: పవన్ కళ్యాణ్ Fri, May 20, 2022, 04:21 PM
పదవ తరగతి విద్యార్థులకు టీఎస్ఆర్టీసి బంపర్ ఆఫర్ Fri, May 20, 2022, 03:47 PM