యాసంగి వరి ధాన్యం చెల్లింపులు జాప్యం లేకుండా పూర్తి చేయాలి

byసూర్య | Sat, May 14, 2022, 09:09 AM

వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల్ జిల్లాలోని యాసంగి వరి ధాన్యం వివరాల నమోదు, చెల్లింపులు జాప్యం లేకుండా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరజన్ రెడ్డి సౌత్ సూచించారు. శుక్రవారం నూతన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ మందిరంలో వరి ధాన్యం వివరాల నమోదు, చెల్లింపులపై వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల్ జిల్లాల కలెక్టర్లు, జిల్లా అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో 220 కొనుగోలు కేంద్రాలకు అనుమతి ఉండగా, 171 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు మంత్రి సూచించారు. ఇప్పటివరకు 33 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని డీలర్లకు వెంటనే అందించేలా చూడాలని, వర్ష సూచనలు ఉన్నందున ఎలాంటి జాప్యం చేయరాదని, రైతులకు చెల్లించాల్సిన మొత్తాలను రెండు, మూడు రోజుల్లో 100 శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు, సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించారు.


జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడుతూ యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి, వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని జాప్యం లేకుండా సత్వరమే చెల్లించాలని, ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తానని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్. లోకనాథ్ రెడ్డి, వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాల అదనపు కలెక్టర్లు, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, డి. ఆర్. డి. ఓ. నరసింహులు, జిల్లా పౌర సరఫరాల అధికారి అనిల్, డి సి ఓ, వ్యవసాయ శాఖ అధికారి, మార్కెటింగ్ శాఖ అధికారి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణలో 9,618 గ్రూప్ 4 ఖాళీల భర్తీపై కీలక ఆదేశాలు Thu, May 19, 2022, 05:11 PM
రేకుల ఇంటికి రూ.7.2 లక్షల కరెంటు బిల్లు! Thu, May 19, 2022, 05:03 PM
తగ్గిన బంగారం ధరలు Thu, May 19, 2022, 04:59 PM
ప్రియుడితో జవాన్ భార్య రాసలీలలు.. ఒక్కసారిగా ఆలా చూసి Thu, May 19, 2022, 04:27 PM
సింగరేణిలో పెండింగ్ లో ఉన్న వారసులకు ఉద్యోగాలు Thu, May 19, 2022, 04:17 PM