ఈ నెల 20వ నుంచి 'పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి' కి శ్రీకారం

byసూర్య | Fri, May 13, 2022, 09:38 PM

తెలంగాణలో చేపట్టనున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఈ నెల 18న సీఎం కేసీఆర్‌ సమీక్షించనున్నారు. ప్రగతి భవన్‌ వేదికగా బుధవారం ఉదయం 11 గంటలకు ఈ సమీక్ష జరగనుంది. ఈ సందర్భంగా మంత్రులు, జడ్పీ ఛైర్మన్లు, రాష్ట్ర స్థాయి అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, అన్ని జిల్లాల డీపీవోలు, అటవీశాఖ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లు, అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు.

ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 5వ విడత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి చేపట్టనున్నారు. కార్యక్రమాల నిర్వహణపై ఈ సమావేశంలో సీఎం కేసీఆర్​ చర్చిస్తారు. ఇప్పటి వరకు అమలైన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతిని సమీక్షించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.


Latest News
 

పంటలు లేట్‌గా వేసుకునేలా చేసింది ఎవరు: వైఎస్ షర్మిల Thu, May 19, 2022, 09:26 PM
తెలంగాణలో 9,618 గ్రూప్ 4 ఖాళీల భర్తీపై కీలక ఆదేశాలు Thu, May 19, 2022, 05:11 PM
రేకుల ఇంటికి రూ.7.2 లక్షల కరెంటు బిల్లు! Thu, May 19, 2022, 05:03 PM
తగ్గిన బంగారం ధరలు Thu, May 19, 2022, 04:59 PM
ప్రియుడితో జవాన్ భార్య రాసలీలలు.. ఒక్కసారిగా ఆలా చూసి Thu, May 19, 2022, 04:27 PM