ఒమిక్రాన్ ఏపీలో కంటే తెలంగాణలోనే ఎక్కువ

byసూర్య | Mon, Jan 17, 2022, 05:27 PM

తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా ఉంటోంది. తెలంగాణలో 260 కేసులు నమోదు కాగా.. ఏపీలో ఈ సంఖ్య 155. హర్యానా-169, ఉత్తరాఖండ్-93, మేఘాలయ-75, పంజాబ్-61, బిహార్-27, జమ్మూకాశ్మీర్-23, గోవా-21, జార్ఖండ్-14, మధ్యప్రదేశ్-10 కేసులు ఇప్పటిదాకా నమోదయ్యాయి. కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు లక్షల్లో పెరగడానికి ఒమిక్రాన్ కారణమైందంటూ నిపుణులు ఇదివరకే హెచ్చరించారు. దేశంలో అత్యధికంగా ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. దాని తరువాత పశ్చిమ బెంగాలో, రాజస్థాన్ ఉన్నాయి. మహారాష్ట్రలో 1,738, పశ్చిమ బెంగాల్-1,674, రాజస్థాన్-1,276 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ-549, కర్ణాటక-548, కేరళ-536, ఉత్తర ప్రదేశ్-275, తమిళనాడు-241, గుజరాత్-236, ఒడిశా-201 మేర ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజువారీ పాజిటివ్ కేసుల్లో భారీగా పెరుగుదల చోటు చేసుకుంటోంది. రోజూ వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 2,58,089 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల నమోదులో అదే తీవ్రత కొనసాగుతోంది. కొంతకాలంగా రెండున్నర లక్షలకు పైగా రోజువారీ కేసులు రికార్డవుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 16 లక్షలను దాటేసింది. యాక్టివ్ కేసుల సంఖ్య 16,56,341గా నమోదయ్యాయి. ఈ పరిణామాల మధ్య ఒమిక్రాన్ వేరియంట్ మరింత విస్తృతమౌతోంది. దేశంలో ఇప్పటిదాకా నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిది వేలను దాటేసింది. తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 8,209గా రికార్డయ్యాయి. ఇది అక్కడితో ఏ మాత్రం ఆగేలా కనిపించట్లేదు. ఇప్పటిదాకా 3,109 మంది డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి.


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM