అమ్మో ఆశ దోస...అపడం:కరెన్సీ నోట్లు అనుకొని పరుగులు తీశారు
 

by Suryaa Desk |

ఆశ దురాశకు చేటు అంటారు. అప్పనంగా సొమ్ము వస్తుందంటే  పరుగులు తీసే రకం మన జనం. అలాంటి ఘటనయే మన హైదరాబాద్ నగరంలో నెలకొంది. హైదరాబాదులోని మాదాపూర్ ప్రాంతంలో ఆసక్తికర ఘటన జరిగింది. కాకతీయ హిల్స్ ఏరియాలో రోడ్డుపై కరెన్సీ నోట్లు పడి ఉన్నాయన్న సమాచారం శరవేగంగా వ్యాప్తి చెందడంతో ప్రజలు అక్కడికి పోటెత్తారు. దూరం నుంచి చూస్తే అవన్నీ 2 వేల రూపాయల నోట్లు లాగానే కనిపించాయి. దాంతో వాటిని తీసుకునేందుకు ప్రజలు ఎగబడ్డారు. కానీ వాళ్ల ఆశ అడియాస కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అవన్నీ పిచ్చి నోట్లు అని గుర్తించి తీవ్ర నిరాశకు గురయ్యారు. పాపం, వాహనాలపై వెళ్లే వాళ్లు కూడా ఆ నోట్ల కోసం రావడంతో ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. అయితే, ఈ పరిస్థితిని గుర్తించిన పోలీసులు... వెంటనే ట్రాఫిక్ ను చక్కదిద్దేందుకు చర్యలు ప్రారంభించారు. జనాలను అక్కడినుంచి పంపించివేశారు. పోలీసులు ఆ నోట్లను పరిశీలించి  అవి పిల్లలు ఆడుకునే పిచ్చి నోట్లు అని గుర్తించారు.


Latest News
టిపియుఎస్ డైరీని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ Sat, Jan 29, 2022, 03:51 PM
కారు బోల్తా.. ఒకరు మృతి Sat, Jan 29, 2022, 03:49 PM
ఉస్మానియాలో క్రికెట్ టోర్నమెంట్ ఏ ముఖం పెట్టుకొని పెట్టారు ..? Sat, Jan 29, 2022, 03:31 PM
అమీర్ పేటలోని ఆ ఫ్యాషన్ మాల్ సీజ్ Sat, Jan 29, 2022, 02:56 PM
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం:మంత్రి తలసాని Sat, Jan 29, 2022, 02:26 PM