ఆ ఊసులు అమలులో ఏక్క డ:షర్మిళ
 

by Suryaa Desk |

రైతులకు ఉచిత ఎరువులు ఇస్తామన్న మీ మాట ఉత్తదైపోయిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. చివరి గింజ వరకు కొంటానన్న ఊసే లేకుండా పోయిందని దుయ్యబట్టారు. పెట్టుబడి రాక రైతులు చస్తూ ఉంటే మీరు సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. ఇప్పుడు ఎరువుల ధరలు పెరిగాయని, దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని మీరు అన్నారని... రైతుల మీద మీకు ప్రేమ పొంగుకొచ్చినందుకు చాలా సంతోషం దొరగారూ అని ఎద్దేవా చేశారు. కేంద్రం మెడలు వంచుతానంటే నమ్మాలా? అని షర్మిల ప్రశ్నించారు. మొన్నటి వరకు మీ మెడ మీద కత్తి పెట్టి వడ్లు కొనబోమని రాయించుకున్నారన్న వాళ్ల మెడలు ఈరోజు మీరు వంచుతారా? ఎందుకు మీ రాజకీయ డ్రామాలు? అని ప్రశించారు. మీ అధికారం కోసం, మీ కుర్చీ కోసం మీరు ఆడుతున్న నాటకాలలో ఇది ఒక భాగమే తప్ప, మీకు రైతుల మీద ప్రేమ లేదని అన్నారు. రైతుల చావుల మీద మీకు సోయి లేదని దుయ్యబట్టారు.


Latest News
మున్సిపాలిటీ అధికారుల వేధింపులు.. మహిళా వ్యాపారి ఆత్మహత్యాయత్నం Thu, Jan 27, 2022, 09:46 PM
డ్రగ్స్ పెడ్లర్ ‘టోనీ’ కి ఐదు రోజుల కస్టడీ Thu, Jan 27, 2022, 09:34 PM
తెలంగాణ లో అప్పటినుండి నైట్ కర్ఫ్యూ Thu, Jan 27, 2022, 09:29 PM
ఖమ్మం లో దారుణం.. మైనర్ బాలికపై 53 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం Thu, Jan 27, 2022, 09:19 PM
ప్రారంభోత్సవానికి సిద్ధమైన కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ప్రాజెక్ట్ Thu, Jan 27, 2022, 09:14 PM