హక్కుల కోసం కలసి నడుద్దాం:బీ.వీ.రాఘవులు

byసూర్య | Thu, Jan 13, 2022, 05:38 PM

హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు సీపీఎం నేత బీ.వీ.రాఘువులు పిలుపునిచ్చారు. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ తో హైదరాబాదులో వామపక్ష నేతలు సమావేశం కావడం తెలిసిందే. ఈ క్రమంలో సీపీఎం అగ్రనేత బీవీ రాఘవులు స్పందించారు. హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. కలిసి పోరాడుదామని కేసీఆర్ ను కేరళ సీఎం పినరయి విజయన్ కోరారని రాఘవులు వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై సీపీఎం పోరాటాలకు సిద్ధమవుతోందని రాఘవులు వెల్లడించారు. సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, కేసీఆర్ మెతక వైఖరి వల్లే తెలంగాణలో బీజేపీ బలపడుతోందని అన్నారు. బీజేపీపై కేసీఆర్ బహిరంగ పోరాటం చేయాలని పేర్కొన్నారు. విచ్ఛిన్నకర రాజకీయాలు చేస్తున్న బీజేపీతో తెలంగాణకు ముప్పు పొంచి ఉందని అభిప్రాయపడ్డారు.


Latest News
 

హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు కుట్ర పన్నిన ముగ్గురు అరెస్ట్ Mon, Oct 03, 2022, 12:01 AM
తెలంగాణ కరోనా అప్డేట్ Sun, Oct 02, 2022, 10:28 PM
టీఆర్ఎస్ పార్టీ నేతలతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం Sun, Oct 02, 2022, 09:10 PM
అప్పుడు నేను గాంధీనే గుర్తు చేసుకునేవాడిని... సీఎం కేసీఆర్ Sun, Oct 02, 2022, 06:19 PM
గొప్ప విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్... నటుడు ప్రకాష్ రాజ్ ప్రశంస Sun, Oct 02, 2022, 06:18 PM