చలి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

byసూర్య | Thu, Jan 13, 2022, 11:55 AM

చలికాలంలో ఎన్నో వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. అందుకే ముందుస్తుగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు త్వరగా వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మరి ఈ సీజన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- చలికాలంలో తాజాగా ఉండే ఆహారం తీసుకోవాలి.
- జమ, దానిమ్మ, బొప్పాయి, అరటిపండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
- ముఖ్యంగా విటమిన్‌ సి ఉన్న పండ్లను తీసుకోవాలి. ఇవి జలుబు, ఫ్లూ నుంచి రక్షిస్తాయి.
- మనషి శరీరానికి యాంటీ యాసిడ్స్‌ ఎంతో అవసరం. గుడ్లు, చేపల్లో ఇవి అధికంగా లభిస్తాయి. జింక్‌ ఉండే బాదం వంటి ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి.
- రోగకారక క్రిములతో పోరాడే పెరుగును తీసుకోవాలి.
- ఎప్పటికప్పుడు వండిన ఆహారాలు తీసుకోవడం మంచిది. బయటి ఆహారాన్ని దూరం పెట్టాలి.
- మార్కెట్‌ లో లభిస్తున్న నల్లద్రాక్ష చర్మ సంరక్షణకు దోహదం చేస్తుంది. వీటిలో విటమిన్‌ ఏ, బీ1, బీ2 ఉంటాయి. పిల్లల్లో కడుపునొప్పికి నివారణిగా పని చేస్తాయి.
- ప్రతి రోజు బయటకు వెళ్లేవారు ఎక్కువ శాతం శరీరాన్ని కప్పి ఉంచే వస్త్రాలను ధరించాలి.
- ఏసీల్లో ఎక్కువగా గడపకపోవడం మంచిది.
- స్నానం చేసే ముందు రెండు చెంచాల నూనెను నీటిలో వేయడం ద్వారా చర్మం మృధుత్వాన్ని కాపాడుకునే అవకాశం ఉంది.
- రాత్రివేళల్లో నిద్రించే ముందు మోచేతులు, మోకాళ్లు పగలకుండా నూనెలు, లేపనాలు రాసుకోవాలి.
- థైరాయిడ్‌ తరహా సమస్యలున్న వారు పై జాగ్రత్తలతో పాటు ఇంట్లో సాక్స్‌లు ధరించడం మేలు.


Latest News
 

నారాయణఖేడ్ లో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు Sat, May 21, 2022, 02:11 PM
పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: మండల విద్యాధికారి అంజయ్య Sat, May 21, 2022, 02:10 PM
సీఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన.. నేడు వివిధ రంగాల ప్రముఖులతో భేటీ. Sat, May 21, 2022, 01:54 PM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత Sat, May 21, 2022, 01:30 PM
నేడు బేగంబజార్ బంద్ Sat, May 21, 2022, 01:25 PM