కేసీఆర్ మాట విని మీ క్రెడిబులిటి పోగొట్టుకోవద్దు: డీజీపీకి ఎంపీ అరవింద్

byసూర్య | Tue, Jan 11, 2022, 05:59 PM

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని ఉద్దేశించి బీజేపీ ఎంపీ అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై డీజీపీ అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేసులు పెట్టమంటే అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని విమర్శించారు. మీ ఎఫ్ఐఆర్ అతిగా ఉందంటూ కోర్టు కూడా తప్పుపట్టిందని, అనవసరంగా క్రెడిబిలిటీ కోల్పోవద్దని అన్నారు. మీకు చిత్తశుద్ధి ఉన్నట్టైతే... కేసులు పెట్టాలని కేసీఆర్ చెపితే రాజీనామా ఆయన మొహాన కొట్టి బీజేపీలోకి రావాలని డీజీపీని ఉద్దేశించి అరవింద్ అన్నారు. బీజేపీ మిమ్మల్ని రాజకీయ నాయకుడిని చేస్తుందని... టికెట్ కూడా ఇస్తుందని అన్నారు. ఏడాదిన్నరలో మీ టీఆర్ఎస్ ప్రభుత్వం పతనమవుతుందని చెప్పారు. ఒక మహిళా టీచర్ చనిపోతే చూడటానికి కూడా రాని కల్వకుంట్ల కవితకు ఎమ్మెల్సీ పదవి అవసరమా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీని విమర్శించే స్థాయి కవితది కాదని అన్నారు.


Latest News
 

రేపు పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు Sat, Sep 24, 2022, 11:36 PM
ఎగ్జామ్స్ లో ఫెయిల్ చేస్తానంటూ విద్యార్థినిపై టీచర్ అత్యాచారం Sat, Sep 24, 2022, 10:30 PM
అవార్డులు రావడంపై మంత్రి కేటీఆర్ హర్షం Sat, Sep 24, 2022, 10:26 PM
మునుగోడు ఉపఎన్నికకు బీజేపీ ఇన్ ఛార్జులు వీరే.. Sat, Sep 24, 2022, 09:40 PM
ప్రజలకు కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు Sat, Sep 24, 2022, 08:33 PM