ట్విట్టర్ నుంచి డబ్బు సంపాదించడం ఎలాగో తెలుసుకోండి

byసూర్య | Mon, Nov 22, 2021, 02:59 PM

ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్  అదిరిపోయే ఫీచర్లతో  తన వినియోగదారులను బాగా ఆకట్టుకుంటోంది.తాజాగా తన ప్లాట్‌ఫాం ద్వారా పేమెంట్ యాక్సెప్ట్, పేమెంట్ సెండ్  చేసేందుకు వీలుగా ఓ ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. టిప్స్  అని పిలిచే ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్  యూజర్లందరికీ రోల్అవుట్ చేస్తున్నట్టు ట్విట్టర్ తాజాగా ప్రకటించింది. బిట్‌కాయిన్  లేదా క్యాష్ సెండ్ చేయడానికి ఈ టిప్స్ ఫీచర్ 18 ఏళ్ల నిండిన ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. టిప్స్ ఫీచర్‌ ఉపయోగమేమిటంటే.. మీరు కంటెంట్ క్రియేటర్ అయితే.. మీ ఫాలోవర్లు మీకు టిప్స్ రూపంలో క్యాష్ అందించొచ్చు. ఒకవేళ మీరే ఫాలోవర్ అయితే కంటెంట్ క్రియేటర్లకు టిప్స్ ద్వారా క్యాష్ సెండ్ చేయొచ్చు.


గతంలో ఇది పరిమిత ఐఓఎస్ యూజర్లకు మాత్రమే అవైలబుల్ లో ఉండేది. కానీ ఇప్పుడు ఇది ఆండ్రాయిడ్ వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది. దీని సాయంతో క్రిప్టోకరెన్సీల రూపంలోని కరెన్సీ చెల్లింపులను కూడా యూజర్లు అంగీకరించవచ్చు. ట్విట్టర్ ప్రొఫైల్ పేజీలోని ఎడిట్ ప్రొఫైల్ లో 'టిప్స్' ఫీచర్ ఆన్ చేస్తే.. టిప్స్ ఐకాన్.. ఫాలో బటన్ పక్కన వచ్చి చేరుతుంది. దానిపై క్లిక్ చేసి పేమెంట్ సేవలు ఆస్వాదించవచ్చు. యూజర్లు వారి పేమెంట్స్ ప్రొఫైల్‌లను లింక్ చేయడానికి టిప్స్ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. బాండ్ క్యాంప్, క్యాష్ యాప్, చిప్పర్ పట్రేన్, రేజర్ పే, వెల్త్ సింపుల్ క్యాష్   వెన్మో వంటి పేమెంట్స్ ప్లాట్‌ఫామ్‌లకు ఈ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. మీరు సంపాదించిన టిప్స్ నుంచి ట్విట్టర్ ఎలాంటి కమీషన్ తీసుకోదు.


 


స్ట్రైక్‌ ని ఉపయోగించి యూజర్లు బిట్‌కాయిన్‌తో కూడా టిప్ సెండ్ చేయవచ్చు. స్ట్రైక్‌ ప్రపంచవ్యాప్తంగా తక్షణ, ఉచిత పేమెంట్స్ సర్వీస్ అందిస్తుంది. ఇది ఎల్ సాల్వడార్, యూఎస్ (హవాయి, న్యూయార్క్ మినహా) ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఎవరైనా స్ట్రైక్ ఖాతాకు టిప్స్ పంపడానికి ఏదైనా బిట్‌కాయిన్‌ లైట్నింగ్ వాలెట్ ఉపయోగించవచ్చు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM