భారీగా పెరిగిన టమోటా ధర
 

by Suryaa Desk |

టమాటా పేరు చెబితేనే సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రోజు రోజుకూ పెరుగుతూ సామాన్య ప్రజలను హడలెత్తిస్తున్న టమాటా ధర సోమవారం నాటికి రిటైల్ మార్కెట్ లో కిలో 90 రూపాయలకు చేరింది.మార్కెట్ కు దిగుమతి తగ్గడం వల్లనే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. తెలంగాణ జిల్లాల్లో టమాటా దిగుబడి బాగా పడిపోయింది. కొన్ని జిల్లాల్లో వర్షాలకు పంట పాడై పోవడం వల్ల ప్రస్తుతం మార్కెట్ కు వస్తున్న టమాటా సైతం సరైన నాణ్యత ఉండడం లేదు. తెలంగాణకు సగానికి సగం టమాటా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్తాన్ నుంచి దిగుమతి అవుతుంది.


కానీ గత కొన్న రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగానే టమాటా పంట పాడైపోవడం వల్ల మార్కెట్ కు రావడం అంటున్నరు. సాధారణ హైదరాబాద్ నగరానికి రోజుకు 120నుంచి 180 లారీల టమాటా దిగుమతి అవుతుంది. కానీ ప్రస్తుతం 50 నుంచి 70 లారీలు కూడ రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో డిమాండ్ కు సరిపడా సప్లయ్ లేక పోవడంతో టమాటా ధరలు చుక్కలనంటుతున్నాయి. మరో వారం నుంచి రెండు వారాల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వ్యపారులు తెలిపారు.


Latest News
తెలంగాణ నుంచి వరి సేకరణపై కేంద్రం బాధ్యత వహించదు: పీయూష్ గోయల్ Thu, Dec 09, 2021, 12:29 AM
వరి సంక్షోభానికి కేంద్రమే బాధ్యత వహించాలి : కేటీఆర్ Thu, Dec 09, 2021, 12:07 AM
హరిత భవనాలు ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ Wed, Dec 08, 2021, 11:36 PM
నిజామాబాద్‌లో ముగ్గురు వ్యక్తులు హత్య Wed, Dec 08, 2021, 10:58 PM
ఎన్నికల అభ్యర్థులకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి: ఖమ్మం కలెక్టర్ Wed, Dec 08, 2021, 10:42 PM