నామినేషన్ దాఖలు చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి
 

by Suryaa Desk |

నామినేషన్ దాఖలు  చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.  కలెక్టరేట్ లో ఈ ఎన్నిక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి విశ్వ నారాయణకు ఈ రోజు నామినేషన్లు అందించారు.కాగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రెండు నామినేషన్లు వేయగా, పోచంపల్లి తరపున మరో రెండు నామినేషన్లు పడ్డాయి.మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి రమేశ్ తో కలిసి ఒక సెట్, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి మరో సెట్ నామినేషన్లను పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వేశారు. ఈ సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విజయం ఖాయం ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం కెసిఆర్ ఆశీస్సులు, మంత్రి కేటీఆర్ అండదండతో తాను మరోసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నిక అవుతానన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.


Latest News
తెలంగాణ నుంచి వరి సేకరణపై కేంద్రం బాధ్యత వహించదు: పీయూష్ గోయల్ Thu, Dec 09, 2021, 12:29 AM
వరి సంక్షోభానికి కేంద్రమే బాధ్యత వహించాలి : కేటీఆర్ Thu, Dec 09, 2021, 12:07 AM
హరిత భవనాలు ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ Wed, Dec 08, 2021, 11:36 PM
నిజామాబాద్‌లో ముగ్గురు వ్యక్తులు హత్య Wed, Dec 08, 2021, 10:58 PM
ఎన్నికల అభ్యర్థులకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి: ఖమ్మం కలెక్టర్ Wed, Dec 08, 2021, 10:42 PM