మబ్బులు పట్టిన మొగులు ..జాడలేని సూర్యుడు : అన్నదాతలు ఆవేదన
 

by Suryaa Desk |

మెదక్ :  నోటికాడికొచ్చిన ముద్ద ఎక్కడ చేజారుతుందోనని రైతులు బిక్కుబిక్కుమంటున్నారు.  కొనుగోళ్లలో జాప్యం.... చెమటోడ్చి పండించిన పంటను పనికిరాకుండా చేస్తోంది.మెదక్ జిల్లాలో ఈ యేడు 375 కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. దీపావళి తర్వాత కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కానీ సాంకేతిక సమస్యలు, లారీల కొరత, ఖాళీ సంచులు లేకపోవడం... ఇలా ఎన్నో కారణాలతో ధాన్యం కొనుగోలులో తీవ్రజాప్యం జరుగుతుండటంతో వడ్లు అమ్ముకునేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. రోజుల తరబడిగా అక్కడే పడిగాపులు కాస్తున్నారు. ఇటీవల వాతావరణంలో వచ్చిన మార్పులు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. త్వరగా ధాన్యం కొనాలంటూ... నిత్యం ఏదో ఒక చోట రోడ్డెక్కి మొరపెట్టుకున్నా తమ గోడు ఎవరికి పట్టడంలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Latest News
నాలుగు లక్షల విక్రయాల మార్కును దాటినా రెనాల్ట్ క్విడ్ Sun, Nov 28, 2021, 12:42 AM
ఫలక్‌నుమా రెండో దశ పనులు త్వరలో ప్రారంభం Sun, Nov 28, 2021, 12:36 AM
నవంబర్ 28న టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం Sun, Nov 28, 2021, 12:31 AM
హైదరాబాద్‌లో నిర్మాణ వర్సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం Sat, Nov 27, 2021, 11:23 PM
హైదరాబాద్ లో బైక్ ట్రక్కు ఢీకొనడంతో ఒకరు మృతి Sat, Nov 27, 2021, 11:04 PM