మద్యం తాగడానికి డబ్బులివ్వలేదని దారుణం
 

by Suryaa Desk |

మద్యానికి బానిసైన ఓ కొడుకు తండ్రిపై తిరగబడ్డాడు. తండ్రిపై వంటనూనె పోసి నిప్పంటించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇంద్రానగర్‌లో నివాసముంటున్న దుర్గారావు కుమారుడు నాగబాబు మద్యానికి బానిసయ్యాడు. తల్లిదండ్రులు తెచ్చిన డబ్బును బెదిరించి దోచుకుని నిత్యం మద్యం సేవించే వ్యక్తి. ఇటీవల దుర్గారావు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే కొడుకు నాగబాబు డబ్బు కావాలని తండ్రిని బెదిరించాడు. అయితే డబ్బులు లేకపోవడంతో తండ్రి దుర్గారావుపై వంటనూనె పోసి కొడుకు నిప్పంటించాడు. ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గమనించి లోపలికి వెళ్లారు. తీవ్ర గాయాలపాలైన దుర్గారావును ఆస్పత్రికి తరలించారు. అయితే దుర్గారావు ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతనిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.


Latest News
నాలుగు లక్షల విక్రయాల మార్కును దాటినా రెనాల్ట్ క్విడ్ Sun, Nov 28, 2021, 12:42 AM
ఫలక్‌నుమా రెండో దశ పనులు త్వరలో ప్రారంభం Sun, Nov 28, 2021, 12:36 AM
నవంబర్ 28న టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం Sun, Nov 28, 2021, 12:31 AM
హైదరాబాద్‌లో నిర్మాణ వర్సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం Sat, Nov 27, 2021, 11:23 PM
హైదరాబాద్ లో బైక్ ట్రక్కు ఢీకొనడంతో ఒకరు మృతి Sat, Nov 27, 2021, 11:04 PM