భారీగా చార్జీలు పెంచేసిన జొమాటో, స్విగ్గీ, క్యాబ్స్‌!

byసూర్య | Wed, Oct 27, 2021, 12:05 PM

హైదరాబాద్‌: క్యాబ్‌లు, ట్యాక్సీబైక్‌లు, జొమాటో, స్విగ్గీ తదితర యాప్‌ ఆధారిత సేవల చార్జీలపై పెట్రోల్, డీజిల్‌ ధరలు ఆజ్యం పోస్తున్నాయి. ఇప్పటికే సర్‌ చార్జీలు, పీక్‌ అవర్స్‌ పేరిట ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్న క్యాబ్‌లు .. పెరిగిన పెట్రోల్, డీజిల్‌ ధరల భారాన్ని సైతం ప్రయాణికులపైనే మోపుతున్నాయి. అన్ని రకాల క్యాబ్‌లు, బైక్‌ల సేవలపై తాజాగా 15 శాతానికి పైగా చార్జీలను పెంచేశారు. దీంతో సిటీజనుల ప్రయాణం మరింత భారంగా పరిణమించింది. మరోవైపు యాప్‌ ఆధారంగా ఆహార పదార్థాలు, వివిధ రకాల వస్తువులను అందజేసే యాప్‌ ఆధారిత సేవలపై సైతం చార్జీలను పెంచేశారు.


ప్రతి రోజు వేలాది మంది ఎంతో ఇష్టంగా ఆర్డర్‌ ఇచ్చే బిర్యానీలు, రకరకాల ఫుడ్‌ ఐటెమ్స్‌పై రవాణా సేవల రూపంలో ఇప్పుడు మరికొంత అదనంగా చెల్లించుకోవాల్సివస్తోంది. నిత్యావసర వస్తువులను, సేవలను అందజేసే యాప్‌ ప్లాట్‌ఫామ్స్‌ కూడా ఇప్పుడు తమ రేట్‌ కార్డులను సవరించాయి. 'గతంలో ఒకటిన్నర కిలోమీటర్‌ దూరానికి రూ.20 మాత్రమే సర్వీసు చార్జీ తీసుకుంటే ఇప్పుడు కొన్ని యాప్‌ ప్లాట్‌ఫామ్స్‌ రూ.25 నుంచి రూ.30 వరకు చార్జీలు వేస్తున్నాయి' అని వినియోగదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెట్రోల్‌ చార్జీల పెంపుతోనే సర్వీస్‌ చార్జీలు పెరిగాయని డెలివరీ బాయ్స్‌ చెబుతున్నారు.


Latest News
 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం Mon, May 20, 2024, 08:58 PM
కుమార్తెను చంపిన తల్లిదండ్రులు.. తల్లికి దూరమైన 13 నెలల పసికందు Mon, May 20, 2024, 08:54 PM